లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు...! 19 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వరుసగా మూడో రోజు కూడా లాభాలలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 80,949.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ.. చివరికి 597.67 పాయింట్ల లాభంతో 80,845.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 181 పాయింట్లు లాభంతో 24,457.15 వద్ద ముగిసింది. దానితో రూపాయి మారకం విలువ 84.69 గా ఉంది.